Ram Charan: రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయంతో ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కంటి పైభాగంలో కుట్లు ఉండటంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక చిన్న ప్రమాదం అని, ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయమైనప్పటికీ ఏమాత్రం తగ్గకుండా, మరుసటి రోజే షూటింగ్‌లో పాల్గొని తన డెడికేషన్‌ను చాటుకున్నారు రామ్ చరణ్.

అస‌లేం జ‌రిగిందంటే..!
గత నెల చివరి వారంలో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డూప్ లేకుండా సొంతంగా స్టంట్స్ చేసేందుకు ప్రయత్నించగా, రామ్ చరణ్ కంటి పైభాగంలో గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి ఆయనకు చికిత్స అందించింది. గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు నాలుగు కుట్లు వేసినట్లు సమాచారం. ఈ వార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియాలో "గెట్ వెల్ సూన్ చరణ్ అన్న" అంటూ పోస్టులు పెట్టారు.

వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా, రామ్ చరణ్ తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను ప్రదర్శించారు. గాయమైన మరుసటి రోజే ఆయన సెట్స్‌కు తిరిగి వచ్చారు. అదే రోజు (మార్చి 27) ఆయన పుట్టినరోజు కావడంతో కంటిపై కట్టుతోనే చిత్ర బృందం మధ్య కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన రగ్గడ్ లుక్‌లో కంటిపై గాయంతో చిరునవ్వుతో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు ఆయన కమిట్‌మెంట్‌ను ప్రశంసిస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 

‘ఆర్ఆర్ఆర్‌’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో మైత్రి మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మొదట మార్చిలో విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక‌, చెర్రీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన 'పెద్ది ప‌హిల్వాన్ గ్లింప్స్‌'లో మాత్రం ఏప్రిల్ 30న మూవీ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 
Ram Charan
Ram Charan injury
Peddi movie
Buchibabu Sana
RRR movie
Telugu cinema
sports drama
AR Rahman
Sukumar Writings
get well soon

More Telugu News