Vijay TVK: ఎన్నికల నియమావళి ఉల్లంఘన... టీవీకే అధినేత విజయ్‌పై ఈసీ కేసు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఒక బహిరంగసభలో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ప్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరవల్లూర్ పోలీస్ స్టేషన్‌లో ఈకేసు నమోదైంది.

బీఎన్ఎస్ 2023, 126(2), బీఎన్ఎస్ సెక్షన్ 189 (2), 223 బీఎన్ఎస్ 3(ఏ) మరియు 3(5) ల కింద పెరవల్లూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళనాడులో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇటీవల ఒక బహిరంగ సభ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈసీ ఆరోపించింది. అధికారుల అనుమతి లేకుండా సభలో ఏకంగా 30 లౌడ్ స్పీకర్లు ఉపయోగించారని, అలాగే 5,000 మందికి మించి ప్రజలు సభకు హాజరయ్యారని, దీనితో ప్రజలకు అసౌకర్యం కలిగించారని ఆరోపిస్తూ ఈసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అలాగే, రోడ్లు బ్లాక్ చేయడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి అంశాల్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. విజయ్‌తోపాటు సభకు హాజరైన పార్టీ కార్యకర్తల్ని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
Vijay TVK
Vijay actor
Tamil Nadu elections
election commission
election rules violation
public meeting

More Telugu News