Italy: స్పెయిన్ బాటలోనే... అమెరికాకు షాకిచ్చిన ఇటలీ

తమ వైమానిక స్థావరాల్లో అమెరికా సైనిక విమానాలు దిగడానికి ఇటలీ అనుమతి నిరాకరించింది. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే స్పెయిన్ అమెరికాకు షాకిచ్చింది. యుద్ధంలో పాలుపంచుకునే విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని స్పెయిన్ ప్రకటించింది. తాజాగా, ఇటలీ కూడా అదే దారిలో నడుస్తోంది. అమెరికాకు తమ గగనతలాన్ని మూసివేయాలని ఇటలీ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.

సిసిలీలోని సిగోనెల్లా వైమానిక స్థావరాన్ని అమెరికా యుద్ధ విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముందు సిసిలీలోని వైమానిక స్థావరంలో తమ బాంబర్ విమానాలను నిలపడానికి అమెరికా ఇటలీ అనుమతి కోరినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటలీ అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
Italy
US Military
Italy US relations
Sigonella Air Base
Spain
Iran
Military Aircraft
West Asia
Geopolitics

More Telugu News