Duniya Vijay: ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ మూవీ!
ఇటీటీలో ఇప్పుడు ఒక కన్నడ మూవీ దూసుకుపోతోంది .. ఆ సినిమా పేరే 'ల్యాండ్ లార్డ్'. జదేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో,దునియా విజయ్ .. రచితా రామ్ .. రాజ్ బి శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. సూరజ్ గౌడ నిర్మించిన ఈ సినిమాను జనవరి 23వ తేదీన విడుదల చేశారు. 12 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 7 కోట్లకి మించి వసూళ్లను రాబట్టలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.
'ల్యాండ్ లార్డ్' సినిమాకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' వారు దక్కించుకున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. దునియా విజయ్ కూతురు 'రితన్య' ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించింది. అజనీశ్ లోక్ నాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందనే ఒక టాక్ బలంగానే వినిపించింది. థియేటర్ల వైపు నుంచి ఓ మాదిరి మార్కులను రాబట్టుకున్న ఈ సినిమా, ఓటీటీలో దూసుకుపోతోందని అంటున్నారు.
1980లలో నడిచే కథ ఇది. రాచయ్య ఓ సాధారణ రైతు .. అతని భార్యనే లింగమ్మ .. వారి కూతురే భాగ్య. ఆ గ్రామానికి చెందిన భూస్వామిగా రాజ్ బి శెట్టి ఉంటాడు. అతను పరమ దుర్మార్గుడు. ఇటు రాజకీయ నాయకులను .. అటు పోలీస్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఒక ఆటాడిస్తూ ఉంటాడు. రైతు కూలీలను అణచివేస్తున్న భూస్వామి పట్ల రాచయ్య ఎలా స్పందిస్తాడు? ఆ ఫలితాన్ని ఆయన కుటుంబం ఎలా ఫేస్ చేస్తుంది? అనేది కథ.