YS Jagan: జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు ‘క్రెడిట్‌ చోరీ డిజార్డర్‌ (సీసీడీ)’ అనే జబ్బు ఉందని ఆరోపిస్తూ, దానికి ఆధారాలు ఇవిగో అంటూ సోమవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

క్రెడిట్‌ చోరీ డిజార్డర్‌ లక్షణాలు ఇలా ఉంటాయి అనే వాక్యంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన గూగుల్‌ డేటా సెంటర్‌, అదానీ డేటా సెంటర్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, కియా మోటార్స్, భోగాపురం విమానాశ్రయం, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వంటి పలు కీలక ప్రాజెక్టులను జగన్ తీవ్రంగా విమర్శించిన క్లిప్పింగులను ఈ వీడియోలో చూపించారు. ఆ తర్వాత, అవే ప్రాజెక్టులు పూర్తయ్యాక వాటిని తానే తెచ్చానంటూ జగన్ క్రెడిట్ తీసుకోవడాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించారు. మధ్యమధ్యలో ‘జగన్‌... నవ చోరీలు...’ అనే కార్టూన్‌ను కూడా జత చేశారు.
YS Jagan
Nara Lokesh
Credit Chori Disorder
Andhra Pradesh Politics
TDP
YSRCP
AP Government Projects
Bhogaouram Airport
Kia Motors
Adani Data Center

More Telugu News