Mumbai Indians: ముంబై-కోల్‌కతా మ్యాచ్.. ప్రియురాలికి ప్రపోజ్ చేయబోయి రింగ్ పోగొట్టుకున్న యువకుడు

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక క్రికెట్ అభిమాని తన ప్రియురాలికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. కానీ చేతిలోని రింగ్ కిందపడటంతో కొన్ని నిమిషాలు గందరగోళం చోటుచేసుకుంది. ఈ సంఘటన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా జరిగింది. దీనిని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను కోల్‌‌కతా నైట్ రైడర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది.

ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించిన ఒక యువకుడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జెర్సీ ధరించిన తన ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి రింగ్ తీసుకువచ్చాడు. ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి అతడు మోకాళ్లపై కూర్చుంటున్న సమయంలో చేతిలోని రింగ్ కిందపడింది.

దీనితో చుట్టుపక్కల కూర్చున్నవారు ఆ ఉంగరం కోసం వెతికారు. ఒక వ్యక్తి ఆ ఉంగరాన్ని గుర్తించి ప్రపోజ్ చేయాలనుకున్న యువకుడికి అందించాడు. ఆ తర్వాత యువకుడు మోకాళ్లపై కూర్చుని, తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఆ యువతి కూడా అతని ప్రపోజల్‌ను అంగీకరించి, అతనిని కౌగిలించుకుంది. దీనితో అక్కడి వారంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు.
Mumbai Indians
IPL
Kolkata Knight Riders
Wankhede Stadium
Cricket fan proposal
Cricket proposal fail

More Telugu News