Prakash Raj: నటుడు ప్రకాశ్ రాజ్ కు సానుభూతి తెలిపిన జగన్

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ప్రకాశ్ రాజ్, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని, మనోబలాన్ని ప్రసాదించాలని జగన్ ఆకాంక్షించారు. సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మాతృ వియోగం అనేది ఎవరూ పూడ్చలేని లోటని, ఈ కష్ట కాలంలో ప్రకాశ్ రాజ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.


గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సువర్ణలత ఈ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

Prakash Raj
Prakash Raj mother
Suvarnalatha
YS Jagan
Jagan Mohan Reddy
YSRCP
Obituary
Condolences
Tollywood
Bengaluru

More Telugu News