Nellore Double Murder: నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జంట హత్యల ఘటన తీవ్ర కలకలం రేపింది. కోవలూరు మండలం గండవరం గ్రామ శివారులోని పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులను దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)గా గుర్తించారు. రెండు వేర్వేరు మండలాలకు చెందిన ఈ యువకులు ఇక్కడ ఎందుకు హత్యకు గురయ్యారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కోణంలో విచారణ జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గండవరం పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
 
Nellore Double Murder
Nellore
Venkatesh
Balavenkaiah
Kovur
Gundavaram
Andhra Pradesh Crime
Double Murder Case
Sri Potti Sriramulu Nellore District

More Telugu News