Iran: మూడు వారాల్లోనే 3 బిలియన్ డాలర్ల నష్టం.. ఇరాన్‌తో పోరులో అమెరికా విలవిల
పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న పోరు అమెరికాకు పెను భారంగా మారింది. ఈ యుద్ధం కారణంగా అగ్రరాజ్యం భారీగా ధన, సైనిక నష్టాలను చవిచూస్తోంది. కేవలం మూడు వారాల వ్యవధిలోనే దాదాపు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 28,455 కోట్లు) నష్టం వాటిల్లినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' అంచనా వేసింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణుల దాడులతో ఈ నష్టం పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.
యుద్ధంలో అమెరికా తన కీలకమైన యుద్ధ విమానాలను కోల్పోతోంది. మార్చి 1న జరిగిన ఓ ఘటనలో, కువైట్‌కు చెందిన ఎఫ్/ఏ-18 విమానం పొరపాటున అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఒక్కో విమానం విలువ 100 మిలియన్ డాలర్లు కాగా, ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు, మార్చి 19న ఇరాన్ జరిపిన దాడిలో 82.5 మిలియన్ డాలర్ల విలువైన ఎఫ్-35ఏ విమానం కూడా ధ్వంసమైంది.
ఇరాన్ దాడుల తీవ్రతకు అమెరికాకు చెందిన కేసీ-135 సైనిక ఇంధన సరఫరా విమానం ఒకటి కూలిపోగా, అందులోని ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడుల్లో మరో ఐదు కేసీ-135 విమానాలు దెబ్బతిన్నాయి. వీటితో పాటు, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా డజనుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కూడా కోల్పోయింది.
అమెరికాకు చెందిన కీలకమైన నిఘా, రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. జోర్డాన్‌లోని 'థాడ్' క్షిపణి రక్షణ వ్యవస్థకు చెందిన ఏఎన్/టీపీవై-2 రాడార్ ధ్వంసం కావడంతో సుమారు 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థలు కూడా దాడులకు గురయ్యాయి. సముద్రంలోనూ యూఎస్ఎస్ జెరార్డ్ ఆర్ ఫోర్డ్ విమానవాహక నౌకలో అగ్నిప్రమాదం సంభవించగా, ఇది ఇరాన్ దాడి వల్ల జరిగిందన్న ప్రచారాన్ని అమెరికా ఖండించింది.