Allu Sirish: అల్లు శిరీష్-నయనిక దంపతులను ఆశీర్వదించిన బండి సంజయ్

Bandi Sanjay Visits Allu Aravind Home to Bless Newlyweds
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, నటుడు అల్లు శిరీష్, నయనిక రెడ్డి దంపతులను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆశీర్వదించారు. ఇవాళ హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్, నూతన వధూవరులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "నూతన దంపతులు అల్లు శిరీష్, నయనిక రెడ్డిలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. వారి వైవాహిక ప్రయాణం ఆనందంగా, అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహం ఈ నెల మార్చి 6న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పారిశ్రామికవేత్త అయిన నయనిక రెడ్డిని శిరీష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వంటి ప్రముఖులు నూతన దంపతులను కలిసి తమ ఆశీస్సులు అందించారు. 
Go Back to Shorts
Allu Sirish
Allu Aravind
Nayanika Reddy
Bandi Sanjay
marriage
wedding
Hyderabad
Revanth Reddy
Chandrababu Naidu
Pawan Kalyan

More Telugu News