Chandrababu Naidu: సరిహద్దులు దాటిన టీడీపీ వేడుకలు.. అండమాన్‌లో రెపరెపలాడిన పసుపు జెండా!

Chandrababu Naidu TDP Celebrations Reach Andaman Islands
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అండమాన్, తెలంగాణ నేతలతో మాట్లాడి ఉత్సాహం నింపారు.

ఈ సందర్భంగా టీడీపీ అండమాన్ అధ్యక్షుడు మాణిక్య యాదవ్.. దీవుల్లో పార్టీ కార్యకలాపాలను చంద్రబాబుకు వివరించారు. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ద్వితీయ స్థానంలో నిలిచి ప్రజల ఆదరణ చూరగొందని తెలిపారు. అండమాన్‌లో పార్టీ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు రావాలని ఆయన కోరగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తాను అండమాన్ దీవుల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు, తెలంగాణలోనూ టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఆవిర్భభావం తర్వాతే తెలంగాణలో సామాన్యుడికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అణగారిన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.
Go Back to Shorts
Chandrababu Naidu
TDP Formation Day
Telugu Desam Party
Andaman Nicobar Islands
Manikya Yadav
Bakkanni Narasimhulu
Telangana TDP
TDP Anniversary
Andhra Pradesh Politics

More Telugu News