Krishna District Crime: కృష్ణా జిల్లాలో దారుణం: బాలుడి హత్య, నానమ్మ పరిస్థితి విషమం

దుండగుల దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందగా, నానమ్మ తీవ్ర గాయాలపాలైన విషాదకర ఘటన కృష్ణాజిల్లా నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. పెదలింగాలకు చెందిన బాలాజీ (10) తన నానమ్మ లక్ష్మి (70)తో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వారిద్దరిపై సిమెంట్ రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మిని స్థానికులు హుటాహుటిన విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న నందివాడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సిమెంట్ రాళ్లతో తలపై బలంగా కొట్టడం వల్లే బాలుడు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Krishna District Crime
Pedalingala
Andhra Pradesh Crime
Nandiwada
Vijayawada Hospital
Balaji Murder
Lakshmi Attack
Crime News Andhra Pradesh
Boy Murder
Old woman injured

More Telugu News