విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన

National
Advertisement
  • ఏడాది చివరినాటికి అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి
  • రాజ్‌కోట్‌ వేదికగా మరో 11 ఎయిర్‌పోర్టుల్లో కొత్త కేఫ్‌లు ప్రారంభిస్తామని వెల్లడి
  • 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై, కిడ్స్ జోన్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి
Advertisement
విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ‘ఉడాన్‌ యాత్రి కేఫ్‌లు’ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఢిల్లీలో నిన్న ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ విమాన ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రస్తుతం దేశంలోని 13 విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లు పనిచేస్తున్నాయని, ఆదివారం రాజ్‌కోట్‌ వేదికగా మరో 11 విమానాశ్రయాల్లో వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా రాజ్‌కోట్‌, ఛండీగఢ్‌, ఇందౌర్‌, జమ్ము, పట్నా, అమృత్‌సర్‌, వారణాసి, గ్వాలియర్‌, అగర్తలా, జయపుర, లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుల్లో ఈ చౌక ధరల కేఫ్‌లను ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై సౌకర్యం, 10 ఎయిర్‌పోర్టుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్‌ జోన్‌లు, 16 విమానాశ్రయాల్లో ప్రయాణికులు పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా ‘ఫ్లైబ్రరీ’ వసతిని కూడా అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు.

ఉడాన్ 2.0 పథకం కింద అన్ని ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి చిన్న విమానాశ్రయాలను అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. దీంతోపాటు 11 విమానాశ్రయాల్లో స్థానిక ఉత్పత్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Rammohan NaiduCivil AviationUDAN schemeairportsflight travelaviation ministryairport facilitiesRajkot airportIndia airportsairline passengers

More Telugu News

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం ఉండాలి: సీఎం చంద్రబాబు

04 Nov, 22:54

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు.. త్వరలో 'భారతీయ వాయుయాన్ నియమ్-2026'

04 Nov, 22:30

అమెరికన్లే టార్గెట్: భారీ కాల్ సెంటర్ మోసాన్ని ఛేదించిన ఈడీ

04 Nov, 22:24

EICMA 2026: అత్యంత శక్తిమంతమైన హీరో 'ఎక్స్‌పల్స్ 450' ఆవిష్కరణ

04 Nov, 22:18

క్రిప్టో స్కామ్ గుట్టురట్టు చేసిన ఏపీ సీఐడీ.. తెనాలి మహిళకు రూ.15 కోట్లు వెనక్కి!

04 Nov, 22:07

డబ్ల్యూపీఎల్ 2027: తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై ఢీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

04 Nov, 22:01

సంచలనాల 'తెహల్కా డాట్ కామ్' చేతులు మారింది!

04 Nov, 21:52

చైనాలో 'టెంపరరీ పిల్లలు'.. ఏమిటీ ట్రెండ్?

04 Nov, 21:45

చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే 'సమ్మర్ హాలిడేస్'.. ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక

04 Nov, 21:39

'మురసు' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

04 Nov, 21:34

బంతితోనే కాదు.. బుర్రతోనూ.. కవ్వించి మరీ టిక్నర్‌ను ఔట్‌ చేసిన బ్రార్‌!

04 Nov, 21:30

ఇండిగో భారీ ప్లాన్.. 100 కొత్త విమానాలకు ఆర్డర్!

04 Nov, 20:52

గాజులాంటి తల.. లోపల తిరిగే కళ్లు.. ఇలాంటి చేపను ఎప్పుడూ చూసి ఉండరు!

04 Nov, 20:45

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈశ్వర్‌ కిరణ్ కుమార్ రెడ్డికి ఈడీ కస్టడీ

04 Nov, 20:31

మెర్సిడెస్ కొత్త ఈవీ 'జీఎల్ సీ ఎలక్ట్రిక్'.. మార్చి వరకు బుకింగ్స్ పూర్తి

04 Nov, 20:15
..More Telugu News