Barron Trump: వార్తల్లోకెక్కిన ట్రంప్ కుమారుడు... ఏంచేశాడంటే...!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బ్యారన్ ట్రంప్‌ను కోర్టు ప్రశంసించడంతో వార్తల్లోకి ఎక్కాడు. బ్యారన్‌తో స్నేహం చేస్తున్నందుకు తన ప్రియురాలిపై దాడి చేసిన ఓ వ్యక్తికి యూకే కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. మాత్వే రూమియాంత్సేవ్ (23) అనే రష్యా జాతీయుడిని ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. బ్యారన్ ట్రంప్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే బాధితురాలి ప్రాణాలు నిలిచాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే.. గతేడాది జనవరి 18న లండన్‌లోని తన ఫ్లాట్‌లో రూమియాంత్సేవ్ తన ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అమెరికాలో ఉన్న బ్యారన్ ట్రంప్, ఆ యువతితో ఫేస్‌టైమ్ వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారు. బ్యారన్‌తో స్నేహంపై అసూయతో రగిలిపోయిన రూమియాంత్సేవ్, ఆమెను జుట్టు పట్టి లాగి, తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన బ్యారన్, వెంటనే యూకే ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.

ఈ కేసు విచారణ స్నార్స్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో జరిగింది. న్యాయమూర్తి జోయెల్ బెన్నతన్, బ్యారన్ ట్రంప్ చూపిన చొరవను ప్రశంసించారు. ‘అమెరికాలో ఉన్నప్పటికీ బ్యారన్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎమర్జెన్సీ సర్వీసులకు ఫోన్ చేశారు. అతను చూసింది చెప్పారు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితుడు రూమియాంత్సేవ్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని, అసూయతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని మండిపడ్డారు.

దాడికి పాల్పడినందుకు రెండేళ్లు, జైలు నుంచి బాధితురాలికి లేఖ రాసి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు మరో రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది.
Barron Trump
Donald Trump son
Matvey Rumyantsev
UK court
Snarsbrook Crown Court
London
domestic violence
emergency services
Joel Bennathan

More Telugu News