Seetha Devi: 108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..!
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. పి. గన్నవరానికి చెందిన ఓ మహిళా భక్తురాలు, సీతాదేవికి 108 రకాల పిండివంటలతో వైభవంగా సారె సమర్పించారు. గత 18 సంవత్సరాలుగా ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం విశేషం.
పి. గన్నవరంలోని వైనతేయ గోదావరి నదీ తీరంలో ఉన్న పురాతన పట్టాభి రామాలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పేరిచర్ల సత్యవాణి అనే గృహిణి, తన భక్తిని చాటుకుంటూ అమ్మవారికి 108 రకాల వంటకాలతో కూడిన సారెను నివేదించారు. ఈ సారె కోసం 300 లీటర్ల పాలతో కోవాను తయారు చేసి ఆ కోవాతో వివిధ రకాల ఆకృతుల్లో పదార్ధాలు తయారు చేసి కంతలో ఉంచారు. వీటితో పాటు అరిసెలు, బూరెలు వంటి సంప్రదాయ పిండివంటలను కూడా అమ్మవారికి సమర్పించారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.