Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్... అమెరికాపై రష్యా సంచలన ఆరోపణలు

Sergey Lavrov Accuses US of Nord Stream Pipeline Plot
Advertisement
  • నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆమెరికా చూస్తోందన్న రష్యా
  • ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన రష్యా మంత్రి
  • ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని వ్యాఖ్య
Advertisement
అమెరికాపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తోందని ఆరోపించారు. ఫ్రాన్స్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్‌పై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా యూరప్ కు సరఫరా చేసే గ్యాస్ పైప్‌లైన్‌లను తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని అన్నారు.

శీతాకాలంలో యూరప్ ఖండానికి రష్యా నుంచి గ్యాస్ సరఫరాలో నార్డ్ స్ట్రీమ్‌ది కీలకపాత్ర. జర్మనీకి సహజ వాయువును తీసుకువచ్చేందుకు బాల్టిక్ సముద్రంలో నార్డ్ స్ట్రీమ్ గొట్టపు మార్గాలను నిర్మించింది. 2022లో ఈ పైప్‌లైన్‌లలో లీకేజీలు కనిపించాయి. పేలుళ్ల కారణంగా లీకేజీలు వచ్చాయని భావించారు. పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ విధ్వంసం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా గతంలోనే ఆరోపించింది. ఇప్పుడు నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఆ దేశ మంత్రి వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement
Sergey Lavrov
Nord Stream Pipeline
Russia
United States
Gas Pipeline
Europe Gas Supply
Energy Market

More Telugu News