ఇప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలు: అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల (లెజినోవా) సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఆమె, తన పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో తనకున్న అనుబంధం గురించి ఆమె చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మెగా కుటుంబంలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా అన్నా తన అనుభవాలను పంచుకున్నారు. "వచ్చిన కొత్తలో ఎవరిని ఏమని పిలవాలో నాకు తెలియలేదు. నా భర్త (పవన్ కల్యాణ్) వాడే మాటలనే నేనూ వాడాను... అన్నయ్య, చిన్నన్నయ్య!. మొదట అవి కేవలం మాటలే అయినా, కాలక్రమేణా అవే నా భావాలయ్యాయి. నాకు సోదరులు లేరు. కానీ జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది" అంటూ చిరంజీవి, నాగబాబులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు. ఈ మేరకు చిరంజీవి, నాగబాబులతో కలిసున్న ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు.
అన్నా కొణిదెల ఇన్‌స్టాలోకి వచ్చిన 24 గంటల్లోనే ఆమెను 2.40 లక్షల మందికి పైగా ఫాలో అవడం విశేషం. ఆమె పోస్ట్‌కు లక్షకు పైగా లైకులు వచ్చాయి. చాలా కాలంగా సోషల్ మీడియాలోకి రావాలనుకున్నానని, ఇదే సరైన సమయమని భావించి వచ్చానని ఆమె తెలిపారు. 2011లో 'తీన్‌మార్' సినిమా షూటింగ్‌లో పవన్‌తో పరిచయమైన అన్నా, 2013లో ఆయన్ను వివాహం చేసుకున్నారు. తాజా పోస్ట్‌తో మెగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు స్వాగతం పలుకుతూ కామెంట్లు పెడుతున్నారు.