మార్కాపురం ఘోర ప్రమాదంపై మంత్రులు, వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలువురు మంత్రులు విచారం వ్యక్తం చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. అనంతరం ఆమె హుటాహుటిన విజయవాడ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్ తదితరులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు సాయం అందించాలి
ఈ ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.