మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం వద్ద టిప్పర్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన అత్యున్నత వైద్య సాయం అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. "క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే.