అమెరికా విమాన వాహకనౌక లక్ష్యంగా క్షిపణి దాడులు చేశాం: హెచ్చరించిన ఇరాన్ ప్రకటన

ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన రెండు రోజుల అనంతరం,  అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది.

యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక వైపు తాము క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. దీనిని అమెరికా ధృవీకరించవలసి ఉంది.

ఈ విమాన వాహక నౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఆ తర్వాత గంటలోపు క్షిపణి దాడి జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది.

అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ఇదివరకు కూడా ప్రకటించింది. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని, దీనితో అది పని చేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల ఇరాన్ ప్రకటించగా, అమెరికా తోసిపుచ్చింది.


More Telugu News