ఆ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు: బండి సంజయ్
ప్రాంతీయ అసమానతల పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాంతీయ అసమానతల పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారా అని మండిపడ్డారు. దేశభక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కనిపిస్తోందా అని ప్రశ్నించారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే ఆందోళన వారిలో మొదలైనట్లుగా ఉందని అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా పారడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ కాంగ్రెస్ వారు కొత్త డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషమని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన కాంగ్రెస్ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు.