Kadiyam Srihari: కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ చేసిన పల్లా... దేవాదుల ఎత్తిపోతల పథకం సృష్టికర్తను తానేనని కడియం చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు.
కడియం శ్రీహరి నిజాయతీ గల నాయకుడు కాదని, బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని పల్లా సంచలన ఆరోపణలు చేశారు. నైతికత గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినా, సమీకరణలు మారినా తాను జనగామ ప్రజలకు సేవ చేయడం కొనసాగిస్తానని, అక్కడి ప్రజలతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని పల్లా స్పష్టం చేశారు.