Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో వడగళ్ల వాన... రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్

Hailstorm in Hyderabad Rangareddy Red Alert
Advertisement
  • వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన
  • హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
  • ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం
Advertisement
హైదరాబాద్‌‍లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హయత్ నగర్, గాయత్రీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఘట్‌కేసర్, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురుస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈరోజు మధ్యాహ్నం వర్షం కురిసింది. ఆ తర్వాత కాస్త తెరిపిచ్చినప్పటికీ, సాయంత్రం మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.
Advertisement
Advertisement
Hyderabad Rain
Hyderabad
Rangareddy
Red Alert
Telangana Weather
Heavy Rainfall
Hailstorm
Weather Update
IMD Alert

More Telugu News