జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నటి, మోడల్ హర్షిల్ కాలియా దుర్మరణం
ప్రముఖ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి.
సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో జైపూర్‌లోని షిప్రా పత్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె నడుపుతున్న కారు ఒక మలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారును సరిచేసి హర్షిల్‌ను బయటకు తీశారు.
వెంటనే ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? లేక మరో వాహనం ఏదైనా ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్షిల్ కాలియా 'క్రైమ్ నెక్స్ట్ డోర్' అనే వెబ్ సిరీస్‌తో పాటు పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో నటించి గుర్తింపు పొందారు. గతంలో ఒక న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా కూడా పనిచేశారు. ఆమె తండ్రి కూడా ఒక వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు సమాచారం.