Ranveer Singh: ఫేక్ కలెక్షన్లతో 100 కోట్లు రావు.. ‘ధురంధర్ 2’ చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు

Durandhar The Revenge Real Collections Praised by Kunal Kohli
షార్ట్స్‌లో చూడండి
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం భారత సినిమా అసలైన సత్తాను చూపిస్తోందని కొనియాడారు. కొందరు ఫేక్ కలెక్షన్లతో ప్రచారం చేసుకుంటున్నారని, కానీ ఈ సినిమా నిజమైన వసూళ్లతో రోజుకు రూ.100 కోట్లు సాధిస్తోందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా కునాల్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. "దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్‌వీర్ సింగ్, జియో స్టూడియోస్‌కు అభినందనలు. ఈ సినిమా రెండుసార్లు రోజుకు రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద హిట్‌గా నిలిచింది" అని తెలిపారు. దేశీ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా నిరూపించిందని, పాశ్చాత్య పోకడల వైపు వెళ్లకుండా మన కథలనే నమ్ముకోవాలని ఆయన సూచించారు.

"హీరోలు మగాడిలా ఉండాలి. హిందీ సినిమా హీరోలు పౌరుషంగా కనిపించాలి. ఏదో అయోమయంలో ఉన్న కుర్రాడిలా కాదు" అంటూ కునాల్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేక్ కలెక్షన్లను ప్రస్తావిస్తూ.. "కొన్ని సినిమాలు ఫేక్ కలెక్షన్లతో కూడా లైఫ్‌టైమ్‌లో రూ. 100 కోట్లు దాటలేవు. కానీ ఈ చిత్రం నిజమైన టికెట్ అమ్మకాలతో రోజుకు రూ. 100 కోట్లు రాబడుతోంది" అని ఆయన విశ్లేషించారు.

‘ధురంధర్’ (2025) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19, 2026న విడుదలైంది. పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటుగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.
Go Back to Shorts
Ranveer Singh
Durandhar The Revenge
Aditya Dhar
Kunal Kohli
Box Office Collection
Fake Collections
Bollywood Movie
Indian Cinema
Spy Thriller
Jio Studios

More Telugu News