హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిన నీరు
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో నగరం తడిసిముద్దయింది. మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్, జగద్గిరిగుట్ట సూరారం, కొంపల్లి, సుచిత్ర, దుండిగల్, గండిమైసమ్మ, బౌరంపేట్, బహదూర్‌పల్లి, చింతల్, షాపూర్ నగర్, బాలానగర్, గాజులరామారం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, బాలాజీనగర్, బేగంబజార్, కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లిబర్టీ, హిమయత్ నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
మణికొండలో వడగళ్ల వాన పడింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల రహదారులు నీటితో నిండిపోయాయి. రోడ్లపై వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి బ్రిడ్జి సహా పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.