ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్
- పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరిపినట్లు వెల్లడి
- ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రకటన
- హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ దేశాలకు అవసరమన్న మోదీ
వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందని ట్రంప్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, రక్షణ కల్పించడం ప్రపంచ దేశాలకు అత్యవసరమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. శాంతి, సుస్థిరం దిశగా చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 24 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి, ట్రంప్ నిన్న తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌తో తదుపరి చర్చల ఫలితాలను బట్టి నిర్ణయం ఉంటుందని అన్నారు. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ కాల్ చేయడం గమనార్హం.