Harish Rana: 13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా

Harish Rana Dies After 13 Years in Coma
షార్ట్స్‌లో చూడండి
హరీశ్ రాణా మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రమాదవశాత్తు గాయపడి 13 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిపోయిన ఘజియాబాద్‌కు చెందిన హరీశ్ రాణా మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవలే హరీశ్ తల్లిదండ్రులు కారుణ్య మరణం కోసం కోరగా, సుప్రీంకోర్టు రెండు వారాల కిందట ఆమోదం తెలిపింది. దీనితో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అతడికి చికిత్స నిలిపివేశారు.

హరీశ్ రాణా పంజాబ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో 2013 ఆగస్టు 20న హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. కుమారుడి చికిత్స కోసం ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ క్రమంలో కారుణ్య మరణానికి అనుమతించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Go Back to Shorts
Harish Rana
Harish Rana death
Ghaziabad
coma patient
Supreme Court
mercy killing
AIIMS Delhi

More Telugu News