Rinku Singh: తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ రింకూ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పథకంలో భాగంగా రింకూ సింగ్‌కు ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ వేదికపై దేశానికి గర్వకారణంగా నిలిచిన పలువురు ఇతర అథ్లెట్లకు కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉద్యోగాలను ప్రకటించింది.
ఇండియా టుడే కథనం ప్రకారం, టీ20 ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవడంలో రింకూ సింగ్ అందించిన సేవలకు గుర్తింపుగా అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (ఆర్ఎస్ఓ)గా నియమించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ టోర్నమెంట్ రింకూకు వ్యక్తిగతంగా ఎంతో విషాదాన్ని మిగిల్చింది. టోర్నీ మధ్యలోనే తండ్రి క్యాన్సర్‌తో మరణించినా, ఆ బాధను దిగమింగుకుని తిరిగి జట్టుతో చేరి దేశం కోసం ఆడటం అతని అంకితభావానికి నిదర్శనం.
రింకూతో పాటు మరికొందరు క్రీడాకారులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పించారు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు సభ్యుడు, ఘాజీపూర్‌కు చెందిన రాజ్‌కుమార్ పాల్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా నియమించారు. అలాగే, పారాలింపిక్స్‌లో సత్తా చాటిన గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన హైజంప్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు కూడా డీఎస్పీ హోదా కల్పించారు. ఇటావాకు చెందిన పారాలింపిక్ జావెలిన్ త్రో రజత పతక విజేత అజిత్ సింగ్, ఘజియాబాద్‌కు చెందిన పారాలింపిక్ 200 మీటర్ల కాంస్య పతక విజేత సిమ్రన్‌లకు జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్ పోస్టులను కేటాయించారు.
ఈ నియామకాలతో పాటు 2024-25 సంవత్సరానికి గాను 9 మంది క్రీడాకారులను లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులతో సత్కరించనున్నారు. ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. లక్నోలోని లోక్ భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ క్రీడాకారులకు నియామక పత్రాలను, అవార్డులను అందజేసి అభినందించనున్నారు.