స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఏపీ ప్రభుత్వం నిరూపించింది: ఆదిత్య మిట్టల్
ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానం స్పష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఏపీ ప్రభుత్వం నిరూపించిందని అన్నారు.
పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులకు ఏపీపై ఉన్న నమ్మకానికి ఈ పరిశ్రమే అతిపెద్ద ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆదిత్య మిట్టల్ తెలిపారు. విశాఖలోని ప్లాంట్ నుంచి ముడి ఇనుము ఖనిజం సరఫరా కోసం పైప్‌లైన్‌ను అనకాపల్లి వరకు విస్తరించనున్నట్లు చెప్పారు. ఇక్కడ తయారైన ఉక్కు ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడంతో పాటు, దేశీయ అవసరాలకు కూడా సరఫరా చేస్తామని వివరించారు.
జాతీయ ఉక్కు విధానం లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు రెండు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నామని, మెటలర్జికల్ రంగంలో కోర్సుల కోసం ప్రత్యేకంగా ఒక ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నక్కపల్లిలో ఏర్పాటు చేయబోతున్న ఈ పరిశ్రమలో ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి, భూములిచ్చిన రైతులకు, స్థానిక ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.