హీరోల కన్నా దర్శకులే గొప్పవారు.. 'ధురంధర్ 2' డైరెక్ట‌ర్‌కి కంగనా ఫిదా

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' చిత్రంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటి కంగనా రనౌత్ కూడా చేరారు. ఆదిత్య ధర్‌ను 'సూపర్‌స్టార్ ఫిల్మ్‌మేకర్' అని అభివర్ణిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.

"ధురంధర్ విజయంలో అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, ఆదిత్య ధర్ ఒక సూపర్‌స్టార్ దర్శకుడిగా నిలదొక్కుకోవడం. హాలీవుడ్‌లో సూపర్‌స్టార్ నటుల కన్నా సూపర్‌స్టార్ దర్శకులే ఎంతో గొప్పవారు. ఉదాహరణకు స్పీల్‌బర్గ్, టరాన్టినో, నోలన్ వంటి వారిని చూడవచ్చు" అని కంగనా పేర్కొన్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకులు తక్కువ వేతనాలతో ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందని ఆమె తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. "ఇక్కడ హీరోల‌ కన్నా ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక సూపర్‌స్టార్ ఫిల్మ్‌మేకర్ ఉన్నారు. ఆయన కథను చూసి ఎందరో యువకులు స్ఫూర్తి పొందుతారు. ఆయనలాగే ఎదగాలని ఆకాంక్షిస్తారు. సినీ పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. మీకు నా సెల్యూటేషన్స్, సర్" అంటూ ఆదిత్య ధర్‌ను కంగనా కొనియాడారు.


More Telugu News