ఇది సినిమా కాదు... రీసెట్ బటన్: ధురంధర్-2పై రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ధురంధర్-2' చిత్రంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ధురంధర్ ది రివెంజ్ చిత్రం భారతీయ సినిమా గతిని మార్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదని, ఇండియన్ సినిమాకు ఒక 'రీసెట్ బటన్' అని వర్మ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఇతర ఫిల్మ్ మేకర్స్‌ను ఉద్దేశిస్తూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "2026 మార్చి 19కు ముందు తీసిన సినిమాలన్నింటినీ మరిచిపోకపోతే ఫిల్మ్ మేకర్స్ మూర్ఖులవుతారు. ఆ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ తమ సినిమాలను 'ధురంధర్ 2'తో పోల్చుకోవాలి. లేదంటే దాని అగ్నిలో కాలి బూడిదైపోతారు" అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు.

రణవీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన ధురంధర్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ ది రివెంజ్ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజై... బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారతీయ సినీ రికార్డులను తిరగరాసే దిశగా దూసుకెళుతోంది. 




More Telugu News