ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా భారత్ సాయం కోరినట్లు వార్తలు.. స్పందించిన కేంద్రం

National
Advertisement
  • భారత్‌లోని మిలటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా అడిగినట్లు ప్రచారం
  • నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
  • ఇలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని విజ్ఞప్తి
Advertisement
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా భారత్ సహాయం కోరిందని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలంటూ కొట్టిపారేసింది. పశ్చిమాసియాలో 22 రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది.

ఈ నేపథ్యంలో పశ్చిమ భారత్ నుంచి ఇరాన్‌పై దాడులు చేయడానికి వీలుగా మిలటరీ స్థావరాలను వినియోగించుకుంటామని అమెరికా అడిగినట్లు ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాలో కథనాలు రావడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇలాంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని కోరింది. నిరాధారమైన, కల్పిత విషయాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. 

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో శ్రీలంకకు సమీపంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచివేసింది. ఆ సమయంలో భారత పోర్టులను అమెరికా ఉపయోగించుకుంటోందనే ప్రచారం జరగగా, ప్రభుత్వం ఖండించింది.

ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిసనాయక ఆ దేశ పార్లమెంటులో మాట్లాడుతూ, రెండు యుద్ధ విమానాల కోసం అమెరికా తమ పోర్టులను ఉపయోగించుకుంటామని చెబితే తిరస్కరించామని వెల్లడించారు. తాము యుద్ధంలో తటస్థంగా ఉంటున్నామని, అందుకే తమ పోర్టులను ఉపయోగించుకోవడానికి అంగీకరించలేదని తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడి ప్రకటన అనంతరం భారత్ సహాయం కూడా అమెరికా కోరినట్లు ప్రచారం జరగడం గమనార్హం.
Advertisement

సంబంధిత వార్తలు

IndiaIranAmericaUS India relationsWest Asia conflictMilitary basesForeign affairs ministry

More Telugu News

'మాతో ఉండండి లేదా మాకు వ్యతిరేకంగానైనా ఉండండి'.. ఇరాన్‌కు సాయం చేసినందుకు భారత దంపతులపై అమెరికా ఆంక్షలు

05 Nov, 08:54

అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం.. కర్ణాటకతో బలమైన బంధం

05 Nov, 08:46

అమెరికా కాంగ్రెస్ డెమోక్రాట్ల కైవసం.. హెచ్‌1బీ వీసాలపై భారతీయులకు ఆశలు!

05 Nov, 08:32

అగ్రరాజ్యంలో మనోళ్ల ప్రభంజనం.. ఎన్నికల్లో 30 మందికి పైగా ఘన విజయం

05 Nov, 08:16

11 ఏళ్ల తర్వాత పాడినా చిక్కులే.. 'మాతృభూమి' పాటతో ఇరుక్కున్న సల్మాన్

05 Nov, 08:11

మురసు తుపాను ఎఫెక్ట్.. వాయిదా పడ్డ కేఆర్‌ఎంబీ భేటీ

05 Nov, 08:03

పలు దేశాల్లో గూగుల్ ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్.. కారణం ఇదే!

05 Nov, 08:01

ఏపీలో పరిషత్ పోరు.. ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

05 Nov, 07:44

రాప్తాడు బాలికకు ఆపరేషన్ విజయవంతం: మంత్రి లోకేశ్

05 Nov, 07:28

జో రూట్‌పై సచిన్ ప్రశంసల జల్లు.. వన్డే ఫార్మాట్‌ను మార్చాల్సిందేనంటూ కొత్త ప్రతిపాదన

05 Nov, 07:16

ఇరాన్ యుద్ధమే రిపబ్లికన్లను ముంచింది: అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్

05 Nov, 07:10

పరిషత్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ

05 Nov, 06:59

మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం.. అయినా మళ్లీ అదే చేస్తా: ట్రంప్

05 Nov, 06:57

జియో సంచలనం.. రూ. 15కే రోజంతా అన్‌లిమిటెడ్ 5G డేటా!

05 Nov, 06:43

మురసు తుపాను ప్రభావం: ఆరు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా

05 Nov, 06:43
..More Telugu News