ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆకాశాన్నంటుతున్న చమురు ధరలను నియంత్రించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై ఒకవైపు సైనిక దాడులు కొనసాగిస్తూనే, మరోవైపు ఆ దేశ చమురు రవాణాపై ఉన్న ఆంక్షలను 30 రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లోకి ఇరాన్ చమురు అందుబాటులోకి వచ్చి, ధరలు తగ్గుముఖం పడతాయని వాషింగ్టన్ భావిస్తోంది.
ఈ వ్యూహాన్ని "ఇరాన్ బ్యారెళ్లను ఇరాన్‌కు వ్యతిరేకంగానే ఉపయోగించడం" అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ అభివర్ణించారు. ప్రస్తుతం సముద్రంలో సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు నిలిచిపోయి ఉంది. ఆంక్షల సడలింపుతో ఈ నిల్వలు ప్రపంచ మార్కెట్లోకి ప్రవహించనున్నాయి. తద్వారా సరఫరా పెరిగి, ఇంధన ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ', 'ఆపరేషన్ రోరింగ్ లయన్' దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థలు బలహీనపడ్డాయి. దీంతో హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకొని ధరలను పెంచాలని టెహ్రాన్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇరాన్ పాత నిల్వలను మార్కెట్‌లోకి వదలడం ద్వారా అమెరికా ఆ ప్రయత్నాలకు గండికొడుతోంది.
ఈ మినహాయింపునకు అమెరికా కఠిన నిబంధనలు విధించింది. కొత్తగా చమురు ఉత్పత్తి చేయడానికి గానీ, ఒప్పందాలు చేసుకోవడానికి గానీ ఇరాన్‌కు అనుమతి లేదు. ముఖ్యంగా, ఈ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం టెహ్రాన్‌కు చేరకుండా కఠినమైన ఆంక్షలు అమలు చేయనుంది. సైనిక చర్యలతో పాటు ఆర్థికంగానూ ఇరాన్‌ను దిగ్బంధించడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.