Village Agriculture Assistants: వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలు.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు
కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ల (వీఏఏ) బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రెండు జిల్లాల్లోని ఉద్యోగులకు తాజాగా కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కృష్ణా జిల్లాలో 103 మంది, కర్నూలు జిల్లాలో 106 మందికి బదిలీలు జరగనున్నాయి.
గతంలో నిర్వహించిన బదిలీల ప్రక్రియలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు సరిగా పాటించలేదని, తాము ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ పలువురు వ్యవసాయ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. తాజాగా కౌన్సెలింగ్ జరపాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును విచారించిన డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగులు గతంలో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగానే బదిలీలు చేపట్టాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. వారు కోరుకున్న స్థానాన్ని కేటాయించలేకపోతే, అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. కొత్త బదిలీల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యోగులను ప్రస్తుతం పనిచేస్తున్న చోటనే కొనసాగించాలని, మొత్తం ప్రక్రియను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించింది.
రాష్ట్రంలో గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రత్యేక కేసుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. త్వరలో స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు విభాగం డైరెక్టర్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కృష్ణా, కర్నూలు జిల్లాల కలెక్టర్లు బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తారు.