భర్త హత్య... కొడుక్కి జీవితఖైదు పడేలా చేసిన తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఒక హత్య కేసులో, తల్లి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ఆమె కొడుకుకు కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భూమి విషయంలో జరిగిన గొడవ కారణంగా ఛత్రపాల్ అనే నిందితుడు గత సంవత్సరం ఏప్రిల్ 11న తన తండ్రిపై కొడవలితో దాడి చేశాడు. అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. ఈ కేసులో తల్లి సాక్ష్యం చెప్పగా, కొడుకుకు శిక్ష పడింది.

ఈ హత్య కేసు విచారణ సమయంలో నిందితుడైన ఛత్రపాల్ తల్లి, సోదరుడితో సహా ఏడుగురు సాక్షులను ప్రాసిక్యూషన్ తరఫున కోర్టులో ప్రవేశపెట్టారు. తన భర్త హత్య కేసులో ఆ మహిళ తన కుమారుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది.

తన భర్తను చంపింది కుమారుడేనని చెప్పింది. కుమారుడి ముఖాన్ని కూడా చూడాలనుకోవడం లేదని కోర్టులో పేర్కొంది. ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ట్రయల్ కోర్టు నిందితుడు ఛత్రపాల్‌కు జీవిత ఖైదుతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. నేర నిర్ధారణ కావడంలో తల్లి సాక్ష్యం కీలకంగా మారినట్లు తెలిపింది.


More Telugu News