ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం థ్రిల్లింగ్ గా అనిపించింది: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ నేపథ్యంలో, చిరంజీవి ఇవాళ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా, మాధురి దీక్షిత్‌ను కలవడంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. "ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మాధురి దీక్షిత్ గారూ. మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఎన్టీఆర్ జాతీయ పురస్కార ప్రదానాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. కాలం ముందుకు సాగినా, తెరపై, బయట మీ అందం, ఆకర్షణ, ఆప్యాయత ఎప్పటికీ నిలిచి ఉంటాయి" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో చాన్నాళ్ల కిందట తాను మాధురిని కలిసిన ఫొటోను కూడా చిరంజీవి పంచుకున్నారు. 




More Telugu News