Ajit Agarkar: అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని బీసీసీఐని కోరినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ ప్రచారాన్ని బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి పూర్తిగా ఖండించారు.
పీటీఐ కథనం ప్రకారం... అగార్కర్ ఈ విషయంపై బోర్డుతో ఎలాంటి చర్చలు జరపలేదని, ఆయన పొడిగింపు కోరాల్సిన అవసరం కూడా లేదని సదరు అధికారి స్పష్టం చేశారు. 2023లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత్ 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే.
"సెలెక్షన్ ప్యానెల్ అనేది బీసీసీఐకి చెందిన ఒక ఉప-కమిటీ. ప్రస్తుత సెలెక్టర్ల కాంట్రాక్ట్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఆ తర్వాత అగార్కర్ కొనసాగింపుపై బీసీసీఐ కార్యదర్శి, అగార్కర్ చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక సీనియర్ సెలెక్టర్ నాలుగేళ్ల వరకు పదవిలో కొనసాగవచ్చు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా పొడిగింపు కోరాల్సిన అవసరం లేదు" అని ఆ అధికారి వివరించారు.