ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్
ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 10,060 పోస్టులతో క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగ యువతను నమ్మించి నయవంచన చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఖాళీలుంటే, ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల సంఖ్య "ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు" అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఉగాది రోజున సీఎం చంద్రబాబు 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. మే 15 నుంచి అక్టోబరు వరకు ఈ నియామకాలు పూర్తి చేస్తామని, ఇకపై ప్రతి ఏటా ఉగాదికి క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
అయితే, ప్రభుత్వ ప్రకటనపై షర్మిల ఘాటుగా స్పందించారు. "కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు" కూటమి ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు చేసింది పచ్చి మోసమని, ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రెండేళ్లుగా నిరుద్యోగులను ఊరించి చివరకు ఉసూరుమనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల్లోని ఖాళీలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. "విద్యాశాఖలో 30 వేలు, పోలీస్ శాఖలో 19,999, ఇంజనీరింగ్ విభాగంలో 20 వేలు, పంచాయతీ రాజ్‌లో 26 వేలు, మున్సిపల్ శాఖలో 27 వేలు, రెవెన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?" అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.
రాష్ట్రంలోని 153 విభాగాల్లో కలిపి 1.80 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రెండేళ్లకు కలిపి కనీసం 50 వేల ఉద్యోగాలనైనా భర్తీ చేయాల్సి ఉందని ఆమె అన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులున్న రాష్ట్రంలో ఇలాంటి క్యాలెండర్లు కాకుండా భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. అలాగే, ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల దరఖాస్తుకు వయోపరిమితిని 42 నుంచి 46 ఏళ్లకు పెంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కోచింగ్ సెంటర్లలో లక్షలు ఖర్చు చేసి ఎదురుచూస్తున్న యువతకు న్యాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.