'ధురంధర్ 2'పై రాజకీయ దుమారం.. నేతల భిన్నాభిప్రాయాలు
తాజాగా విడుదలైన 'ధురందర్ 2' చిత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతీక్ అహ్మద్‌కు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా చూపించడంపై పలు పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్‌పై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంపై బీహార్ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ స్పందిస్తూ, సినిమాలు తరచుగా సమాజంలో జరిగే సంఘటనలనే ప్రజల ముందు ఉంచుతాయని అన్నారు. "అతీక్ అహ్మద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయనతో కలిసి నేను కూడా ఎంపీగా పనిచేశాను. అలాంటి కథను తెరకెక్కించడం సరైనదే. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. టికెట్లు బ్లాక్‌లో కూడా అమ్ముడవుతున్నాయి. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీనటులకు నా శుభాకాంక్షలు" అని ఆయన తెలిపారు.
అయితే, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఈ చిత్రాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది పూర్తిగా బీజేపీ ప్రచార చిత్రమని ఆరోపించారు. "బీజేపీకి ఒక ప్రచార యంత్రాంగం ఉంది. వారు తమ కల్పిత కథనాల ఆధారంగా సినిమాలు తీయిస్తుంటారు. ఎవరి గురించైనా ఏదైనా చెప్పగలరు, ఎలాంటి సంబంధాలనైనా అంటగట్టగలరు" అని ఆయన వ్యాఖ్యానించారు.
జనతాదళ్ (యునైటెడ్) అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఆచితూచి స్పందించారు. తాను సినిమాలు చూడనని, అయితే ఇలాంటి విషయాల్లో అంతిమ బాధ్యత సెన్సార్ బోర్డుదేనని స్పష్టం చేశారు. న్యాయపరమైన చర్యలు ఎదుర్కొన్న వారిని గొప్పగా చూపిస్తే, అది నేరాన్ని కీర్తించినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో జేడీయూ నేత రాజీవ్ రంజన్ మాట్లాడుతూ, సినిమా చూశాకే దానిపై వ్యాఖ్యానించడం సముచితమని అన్నారు.
ఈ వివాదంపై శివసేన అధికార ప్రతినిధి షైనా ఎన్సీ స్పందిస్తూ, ఇది ప్రచార చిత్రమా? కాదా? అనే చర్చ కొనసాగవచ్చని, కానీ బాలీవుడ్ ప్రధాన కర్తవ్యం ప్రజలను అలరించడమేనని పేర్కొన్నారు. వినోదం కోణంలో చూసినప్పుడు, వివాదాలు సృష్టించే ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. మరోవైపు యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు సినిమాలు తీయవని, ప్రేక్షకులను ఏది ఆకట్టుకుంటుందని నమ్ముతారో దాని ఆధారంగానే దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తారని పేర్కొన్నారు. మొత్తం మీద 'ధురందర్ 2' చిత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తిస్తూనే ఉంది.