Kishan Reddy: సేఫ్ జోన్ లో భారత్: కిషన్ రెడ్డి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక, అభివృద్ధితో పాటు శాంతిబాటలో నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సేవ్ జోన్‍లో ఉందని అన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రపంచం మొత్తం యుద్దభూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సేవ్ జోన్‍లో ఉందని అన్నారు.