చట్టాన్ని పక్కనపెట్టారా?.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ చిత్రం!
అమెరికా చరిత్రలో ఒక అపూర్వ నిర్ణయానికి రంగం సిద్ధమైంది. దేశ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయనున్న 24 క్యారెట్ల బంగారు నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రాన్ని ముద్రించనున్నారు. ఈ నాణెం తుది నమూనాకు ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఈ కమిషన్‌లో ట్రంప్ ఎంపిక చేసిన మాగా (MAGA) మద్దతుదారులే ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ మాట్లాడుతూ.. "దేశ 250వ వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ, మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ నాణేలను రూపొందిస్తున్నాం. దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రం కంటే సరైనది మరొకటి ఉండదు" అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ "ట్రంప్ నాణేల" ఉత్పత్తిని యూఎస్ మింట్ ప్రారంభించనుంది.
అయితే, ఈ చర్య నిబంధనలను, సంప్రదాయాలను పక్కనపెట్టడానికి ట్రంప్ వర్గం చేసిన మరో ప్రయత్నమని అసోసియేటెడ్ ప్రెస్ తన కథనంలో పేర్కొంది. అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం, అధికారంలో ఉన్న లేదా జీవించి ఉన్న ఏ అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించకూడదు. అయినప్పటికీ, ట్రెజరీ సెక్రటరీకి ప్రత్యేక బంగారు నాణేలను జారీ చేసే అధికారం ఉందని యూఎస్ మింట్ తెలిపింది. ఈ డిజైన్‌ను పలు నమూనాల నుంచి స్వయంగా ట్రంప్ ఎంపిక చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఈ నాణెం ముందు భాగంలో సూట్, టై ధరించి కఠినమైన ముఖ కవళికలతో ఉన్న ట్రంప్ చిత్రం ఉంటుంది. నాణెంపై "లిబర్టీ", "ఇన్ గాడ్ వి ట్రస్ట్" అనే అక్షరాలతో పాటు 1776-2026 సంవత్సరాలను ముద్రించారు. వెనుకవైపున అమెరికా జాతీయ పక్షి బాల్డ్ ఈగిల్ ఉంటుంది. నాణెం పరిమాణం ఇంకా ఖరారు కానప్పటికీ, ట్రంప్ పెద్ద వస్తువులను ఇష్టపడతారన్న ఉద్దేశంతో, సాధ్యమైనంత పెద్ద పరిమాణంలో దీనిని రూపొందించాలని కొందరు కమిషనర్లు సూచించారు. ఈ నాణేలను చాలా పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.