జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!

రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం ఒక ఆకర్షణీయమైన వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. రూ.3,599 రీఛార్జ్‌తో ఏడాది పాటు టెలికాం సేవలతో పాటు, ఏకంగా రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. తరచూ రీఛార్జ్‌లు చేసే పని లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ ప్లాన్ కింద, వినియోగదారులకు 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 2.5జీబీ హై-స్పీడ్ డేటా, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుబాటులో ఉంటుంది.

ఏఐ ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఆఫర్ చేస్తోంది. 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా క్రికెట్ మ్యాచ్‌లు, లేటెస్టు సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది.


More Telugu News