Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో తెలుగు యువకుడి అరెస్టు

Telugu Youth Nagaraju Arrested in America for Harassment
Advertisement
  • మైనర్లుగా పరిచయం చేసుకుంటూ ఆన్‌లైన్‌లో చిన్నారులను వేధిస్తున్న నిందితులు
  • ఆన్‌లైన్‌లో ఖాతాలు తెరిచి చిన్నారులుగా చాట్ చేసిన పోలీసులు
  • ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
  • అందులో ఒకరు తెలుగు యువకుడిగా గుర్తింపు
Advertisement
మైనర్లను వేధిస్తున్న కేసులో అమెరికాలో ఒక తెలుగు యువకుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మైనర్లుగా పరిచయం చేసుకుంటూ ఆన్‌లైన్‌లో చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిపై న్యూమెక్సికో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నలుగురిని అరెస్టు చేయగా, అందులో ఒకరు తెలుగు యువకుడు ఉన్నాడు. నిందితుడిని నాగరాజుగా గుర్తించారు.

అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా న్యూమెక్సికోలోని శాంటాఫే నగర పోలీసులు ఆన్‌లైన్‌‍లో ఖాతాలు తెరిచారు. పోలీసులు కూడా చిన్నారులుగా నిందితులతో పరిచయం చేసుకుని చాటింగ్ చేశారు. ఈ చాటింగ్ సందర్భంగా చిన్నారులను లైంగిక ప్రలోభాలకు గురిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement
Nagaraju
Telugu youth arrest
America
Minor harassment case
New Mexico
Santa Fe
Cybercrime

More Telugu News