సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ దాడికి పాల్పడింది. గురువారం తెల్లవారుజామున సౌదీలోని అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు సమీపంలో ఈ రిఫైనరీ ఉంది. డ్రోన్ దాడి కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా గాయపడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

ఇరాన్ అంతకుముందు ఖతార్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై దాడికి పాల్పడింది. 

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరాన్‌లో 1,300 మంది, లెబనాన్‌లో 900 మంది, ఇజ్రాయెల్‌లో 14 మంది మరణించారు. ఈ దాడుల్లో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందగా, 200 మంది గాయపడినట్లు అమెరికా సైన్యం తెలిపింది.


More Telugu News