ఉగాది వేళ... పేదల ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం

  • ఉగాది నాడు సీఎంఆర్ఎఫ్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం
  • 6,787 మంది లబ్ధిదారులకు రూ.55.63 కోట్ల నిధుల విడుదల
  • 21 నెలల్లో లక్షలాది మందికి రూ.1241 కోట్ల సాయం
  • సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఫైల్‌పై ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో అనారోగ్యంతో బాధపడుతున్న 6,787 మందికి తక్షణ సాయం కింద రూ.55.63 కోట్లను విడుదల చేశారు.

ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత 21 నెలల కాలంలో సీఎం సహాయ నిధి, ఎల్ఓసీల ద్వారా పేదలకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఈ సమయంలో మొత్తం 1 లక్షా 36 వేల 240 మందికి రూ.1241 కోట్ల మేర ఆర్థిక, వైద్య సాయం అందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ సాయం అందిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి అర్చకులు వేర్వేరుగా కలిసి వేదాశీర్వచనాలు అందించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.

Chandrababu
Andhra Pradesh
CM Relief Fund
CMRF
Ugadi
Financial Assistance
Medical Assistance
TTD
Durga Temple Vijayawada

More Telugu News