Inter Board AP: ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ క్లాసులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Inter Board AP Announces Intermediate Classes from April 1
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యావిధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ విద్యామండలి విడుదల చేసింది. దీని ప్రకారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఎన్‌సీఈఆర్టీ (NCERT) సిలబస్‌ను అమలు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విడుదలైన షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు రెండో ఏడాది పాఠాలు బోధిస్తారు. అనంతరం, ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి తిరిగి కళాశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో దసరా సెలవులను అక్టోబరు 10 నుంచి 20 వరకు, సంక్రాంతి సెలవులను 2027 జనవరి 9 నుంచి 17 వరకు ప్రకటించారు. మొత్తం 232 రోజులు కళాశాలలు పనిచేయనున్నాయి.

పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు విడుదల చేసింది. త్రైమాసిక పరీక్షలు అక్టోబరు 5-9, అర్ధ సంవత్సర పరీక్షలు నవంబరు 25-30 మధ్య జరుగుతాయి. ప్రీఫైనల్ పరీక్షలు 2027 జనవరి 19 నుంచి 23 వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, ఫిబ్రవరి లేదా మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ఉంటాయని క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

ఇదే సమయంలో, ప్రైవేట్ కళాశాలల ప్రచారాలపై ఇంటర్ బోర్డు కఠిన నిబంధనలు విధించింది. ర్యాంకులు, ఉత్తీర్ణత శాతం పేరుతో హోర్డింగ్‌లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా హెచ్చరించారు. ర్యాంకుల గ్యారెంటీ వంటి ప్రకటనలు ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Inter Board AP
AP Intermediate
Intermediate Classes AP
NCERT Syllabus AP
AP Education News
Ranjit Basha
AP Inter Exams 2027
AP Academic Calendar 2026-27
AP Inter Holidays
Private Colleges AP

More Telugu News