పిన్నెల్లికి బెయిల్ మంజూరు.. ఆయన సోదరుడికి షాక్

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు భారీ ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన... గత 98 రోజులుగా నెల్లూరు జైలులో రిమాండ్ లో ఉన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయనకు విముక్తి లభించడంతో పల్నాడు జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


అయితే, ఇదే కేసులో పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాత్రం కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించింది. ఒకరికి బెయిల్ లభించి, మరొకరికి నిరాకరణ ఎదురవ్వడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. త్వరలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి విడుదల కానున్నారు.



More Telugu News