Jag Ladki: 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'

Jag Ladki Ship Reaches India with 80886 Metric Tons of Crude Oil
షార్ట్స్‌లో చూడండి
భారత జెండా కలిగిన 'జగ్ లాడ్కి' అనే ముడి చమురు నౌక బుధవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన ఈ నౌకలో 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. ఈ నౌకను పుజైరా పోర్టులో లోడ్ చేశారు. 'జగ్ లాడ్కి' మొత్తం పొడవు 274.19 మీటర్లు, వెడల్పు 50.04 మీటర్లుగా ఉంది.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే మనవద్ద ఇంధన నిల్వలు ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.

మార్చి 14న పుజైరాలోని ఆయిల్ టెర్నినల్‌పై ఇరాన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 'జగ్ లాడ్కి' అదే సమయంలో అక్కడ ఇంధనం నింపుకుంటోంది. ఇంధనం నింపుకున్న అనంతరం ఈ నౌక అక్కడి నుంచి బయలుదేరి సురక్షితంగా భారత్ చేరుకుంది. ముర్బన్ క్రూడ్‌తో నిండిన ఈ నౌక మూడు రోజుల ప్రయాణం అనంతరం గుజరాత్ తీరానికి చేరుకుంది.

ఇప్పటికే శివాలిక్, నందాదేవి నౌకలు హర్మూజ్ జలసంధిని గుండా ప్రయాణించి సురక్షితంగా భారత్ చేరుకున్నాయి. ఈ నౌకలు ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకువచ్చాయి. సముద్రమార్గంలో జరిగే చమురు రవాణాలో ఐదవ వంతు హర్ముజ్ జలసంధి ద్వారా ఉంటుంది.
Go Back to Shorts
Jag Ladki
Crude oil
Mundra Port
Oil tanker
UAE
Fujairah Port
Iran
Muruban Crude
Hormuz Strait

More Telugu News