Pawan Kalyan: 'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!

 Ustaad Bhagat Singh Movie Update
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, టైటిల్ దగ్గర నుంచే అంచనాలను పెంచడం మొదలుపెట్టింది. ఇక పోస్టర్స్ దగ్గర నుంచే అందరిలోను ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. పవన్ కల్యాణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ కీ .. ఆయన బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోయే కంటెంట్ అనేది అభిమానులకు అర్థమైపోయింది. 

ఈ సినిమాకి దర్శకుడు హరీశ్ శంకర్ కావడం ఇక్కడ మరో విశేషం. హరీశ్ శంకర్ కి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. పవన్ సినిమా నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారనేది ఆయనకి తెలుసునని అనడానికి 'గబ్బర్ సింగ్' సినిమాను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. దేవిశ్రీ బాణీలు .. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తేనే, ఏ స్థాయిలో ఆడియన్స్ ఉత్సాహాన్ని చూపిస్తున్నారనేది అర్థమైపోతుంది. 

పవన్ కల్యాణ్ జోడీగా శ్రీలీల తొలిసారిగా చేసిన సినిమా ఇది. నటన పరంగా .. డాన్స్ పరంగా శ్రీలీలకి వంక బెట్టడానికి లేదు. అయితే ఆమెకి సరైన హిట్ లేక చాలా కాలమే అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక రాశీ ఖన్నా కెరియర్ గ్రాఫ్ చాలా స్లో అయిన తరువాత ఆమెకి దక్కిన గొప్ప అవకాశం ఇది. హరీశ్ శంకర్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా కీలకం కానుంది. 'ఉస్తాద్' ఉ ప్పెనలా పాత రికార్డులు తుడిచేయడం ఖాయమనే అభిమానుల అంచనాలను ఈ సినిమా నిజం చేస్తుందేమో చూడాలి.

Go Back to Shorts
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Mythri Movie Makers
Telugu cinema
Tollywood
Devi Sri Prasad
Thaman S
Raashi Khanna

More Telugu News